PS Telugu News
Epaper

హలో ముదిరాజ్ చలో గాంధీభవన్ ముట్టడి-పాలమూరు యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప ముదిరాజ్

📅 08 Apr 2026 ⏱️ 6:44 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

{పయనించే సూర్యుడు} {ఏప్రిల్8 మక్తల్ }

మక్తల్ నియోజకవర్గం లో అంబేద్కర్ విగ్రహం దగ్గర పాలమూరు యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప హలో ముదిరాజ్ చలో గాంధీభవన్ ముట్టడి కార్యక్రమాన్ని సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఏప్రిల్ 10 తేదీన గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన డిమాండ్లు ముదిరాజులను బిసిడి నుంచి బీసీ ఏలోకి మార్చాలని అదేవిధంగా మత్స్య శాఖలో కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు చేప పిల్లల పంపిణీ పేరుతో విడుదలైన నిధుల దుర్వినియోగం పై పై విచారణ చేపట్టి నిందితులను శిక్షించాలని సామాన్య మత్స్య కార్మికులకు న్యాయం జరగాలని అన్నారు అదేవిధంగా కోకాపేట్ భవన నిర్మాణానికి పూర్తి చేసి పండుగల సాయన్న భవనంగా నిర్మించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ప్రజా వీరుడు పండుగల సాయన్న జయంతి వర్ధంతిని ప్రభుత్వ అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గం బీసీ ముఖ్య నాయకులు శ్రవణ్ గారు అదేవిధంగా నరేష్ ముదిరాజ్. బాలుముదిరాజ్. సంజయ్ ముదిరాజ్.తదితర బీసీ నాయకులు సంఘ నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top