PS Telugu News
Epaper

రాహుల్ గాంధీతో భేటీ అయిన నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్నా కైలాష్ నేత.

📅 02 Mar 2026 ⏱️ 6:43 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ నల్గొండ మర్చి 03.

నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షులు పున్నా కైలాష్ నేత సోమవారం నాడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. వికారాబాద్ లోని హరిత రిసార్ట్స్ లో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ జిల్లాల డిసిసి అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశానికి లోక్ సభ ప్రతి పక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరైనారు.ఈ సందర్భంగా నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత తన కుటుంబంతో సహా హాజరై వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ డిసిసి అధ్యక్షులు చాలా బలంగా పనిచేయాలని ప్రజలతో మమేకం అయితే పదవులు వస్తాయని నాయకుల చుట్టూ తిరిగితే రాదని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో బీసీ లకు తగు ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత కుమారుడు జయంత్ విక్రమ్ రాహుల్ గాంధీ ఛాయ చిత్రంతో కూడిన జ్ఞాపికను అందజేశారు

Scroll to Top