PS Telugu News
Epaper

10 వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన మోహన్ రావ్ పటేల్

📅 27 Dec 2025 ⏱️ 4:35 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో

ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

బైంసా మండలంలోని మాటేగాం వానల్ పాడ్ గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక నాయకుల తో కలిసి స్టడీ మెటీరియల్ (ALL IN ONE)అందచేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు నేర్పించే పాఠాలను శ్రద్ధతో విని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలన్నారు. నేటి తరం పిల్లలు సెల్ ఫోను వాడటం, ఎక్కువగా టీవీ చూడడం చేస్తున్నారని వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మాటేగాం సర్పంచ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు , అధ్యాపకులు, ట్రస్ట్ టీం సభ్యులు, బైంసా మండల, నాయకులు గ్రామస్థులు పాల్గొన్నారు

Scroll to Top