108 అంబులెన్స్‌లో గ‌ర్భీణీ సాధారణ ప్ర‌స‌వం..తల్లి బిడ్డ క్షేమం

July 20, 2026 | సినిమా వార్తలు

108 సిబ్బంది సమయస్ఫూర్తితో తల్లీబిడ్డలను కాపాడుతున్నారు. రవికుమార్( ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్)

108 అంబులెన్స్ సేవలపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

జిల్లా ప్రజలు అత్యవసర 108 అంబులెన్స్ సేవలు వినియోగించుకోవాలి- సునీల్ కుమార్ (డిస్టిక్ మేనేజర్)

పయనించే సూర్యుడు జులై20:నారాయణపేట జిల్లా: ( దామరగిద్ద మండలం):108 అంబులెన్స్‌లో ఓ మ‌హిళ‌ మగ శిశువుకు జ‌న్మించిన ఘ‌ట‌న శనివారం దామరగిద్ద మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మొగలమడక గ్రామానికి చెందిన ” స్రవంతి తన మొదటి కాన్పు నిమిత్తం ‘పురిటి నొప్పుల‌తో బాధ‌ప‌డుతుండగా.. కుటుంబ‌స‌భ్యులు దీంతో త‌క్ష‌ణ‌మే నారాయణపేట 108 అంబులెన్స్ సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని, గర్భిణీ స్త్రీని నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో, మూస్తేపేట గ్రామ మార్గమధ్యలో టెక్నీషియన్ మహేష్ “ఈ ఆర్ సి పి “డాక్టర్ శివ సూచనలతో అంబులెన్స్ లోనే ప్రసవం చేసినారు, గర్భిణీ స్త్రీ కి మగ శిశువుకు.జన్మనిచ్చింది అనంతరం నవజాత శిశువుకు తగు పరిచర్యలు చేస్తూ , ఆక్సిజన్ అందిస్తూ తర్వాత వారిని దగ్గర్లో ఉన్న నారాయణపేట జిల్లా ఆసుపత్రికి త‌ర‌లించామ‌ని 108 అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. అక్కడ వైద్యులు పరిశీలించిన తర్వాత తల్లి బిడ్డ క్షేమమని తెలిపారు అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ఆపద్బాంధవులు చాక‌చాక్యంగా, సమయస్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి..త‌ల్లిబిడ్డ‌ల‌ ప్రాణాల‌ను కాపాడిన108 అంబులెన్స్ సిబ్బంది, పైలెట్ : రాములు టెక్నీషియన్ : మహేష్ లను బాధిత కుటుంబ‌స‌భ్యులు, ఆస్పత్రి వైద్యులు అభినందించారు.

🌐 Select Language:
📰 ePaper