108 సేవల్లో మరో మానవతా దృక్పథ సంఘటన – అంబులెన్స్‌లోనే ప్రసవం, తల్లి బిడ్డ క్షేమం.

July 15, 2026 | తెలంగాణ

ఆపద వస్తే గుర్తు కువచ్చేది మా108 ఆపద్బాంధవులు- జిల్లా మేనేజర్ సునీల్ కుమార్

పయనించే సూర్యుడు జులై 16నారాయణపేట జిల్లా: నారాయణపేట మండలం పెరపళ్ల గ్రామ (మిది తండా)కు చెందిన లలిత భాయ్, 23 సం., w/o గణేష్ నాయక్‌కు బుధవారం తెల్లవారుజామున రెండో కాన్పు నొప్పులు వచ్చాయి. వెంటనే కుటుంబ సభ్యులు దామరగిద్ద 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమయస్ఫూర్తితో స్పందించిన 108 సిబ్బంది:సమాచారం అందుకున్న వెంటనే EMT ఎల్లమ్మ, పైలట్ నడ్డిరాజు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో పెరపళ్ల గ్రామ సమీపంలో అంబులెన్స్‌లోనే “లలిత భాయ్ “మగబిడ్డకు అంబులెన్స్ లోనే జన్మనిచ్చింది.EMT: ఎల్లమ్మ వెంటనే స్పందించి తల్లికి, నవజాత శిశువుకు ప్రథమ చికిత్స అందించారు. పైలట్: నడ్డిరాజు 108 అంబులెన్స్‌ను సురక్షితంగా నడిపి సకాలంలో నారాయణపేట జిల్లా ఆస్పత్రికి చేర్చారు.తల్లీబిడ్డ క్షేమం: జిల్లా ఆస్పత్రి వైద్యులు పరిశీలించి తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించారు. సకాలంలో 108 సిబ్బంది చూపిన చొరవ, మానవత్వానికి నిదర్శనం అని స్థానికులు, కుటుంబ సభ్యులు108 అంబులెన్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper