13 సిలిండర్లను సీజ్ విజిలెన్స్ అధికారులు
పయనించే సూర్యుడు డిసెంబర్ 20( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
విజిలెన్స్ అధికారులు. సివిల్ సప్లైస్ అధికారులు మండల కేంద్రమైన చేజర్ల గ్రామం నందు తనిఖీలు నిర్వహించి, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ మార్కెట్ లో విక్రయిస్తున్నారని గుర్తించి, 13 సిలిండర్లను సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన సిలిండర్లు విలువ ₹37,500/- నమోదు చేసి, పంచనామా నిర్వహించి, సీజ్ చేసిన సిలిండర్లను తగు భద్రత నిమిత్తం చిత్తలూరు గ్యాస్ ఏజెన్సీ వారికి అప్పగించడం జరిగింది. ఈ తనిఖీల్లో విజిలెన్స్ సి ఐ శ్రీహరి రావు, విజిలెన్స్ తహసీల్దారు కృష్ణ ప్రసాద్, విజిలెన్స్ ఏయి. వెంకట రెడ్డి, సివిల్ సప్లైస్ డి టి ఐ.రవి, కానిస్టేబుల్ . బాబ్జీ, ప్రసాద్ . సిబ్బంది పాల్గొన్నారు
