PS Telugu News
Epaper

16 మంది మావోయిస్టులు అరెస్ట్.. ఏకే 47, రెండు ఇన్సాస్‌ ఆయుధాలు స్వాధీనం

📅 16 Dec 2025 ⏱️ 2:43 PM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మావోయిస్టులు లొంగిపోయారు. సిర్పూరు మండలంలోని పెద్దదోబలో మావోయిస్టులు ఉన్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో పెద్దదోబకు చేరుకొని కూంబింగ్ చేపట్టారు. ఈ మేరకు ఓ పూరి గుడిసెలో నట్టిన దాదాపు 16 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. కాగా, పట్టుబడిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. అనంతరం మావోయిస్టుల నుంచి ఏకే 47తోపాటు రెండు ఇన్సాస్ ఆయుధాలను పట్టుకున్నారు. ఇదిలా ఉండగా, మరోవైపు ప్రభుత్వం అందిస్తున్న లొంగుబాటు ప్యాకేజీలు, భద్రతా బలగాల ఒత్తిడికి వరుసగా లొంగిపోతున్నారు. అలాగే నాయకత్వం, సిద్ధాంతపరమైన అంశాలలో అంతర్గత కలహాలతో కొంతమంది లొంగిపోతున్నారు. అలాగే  ఆరోగ్యం, వృద్ధాప్యం కారణంగా అడవుల్లో జీవించడం కష్టంగా మారడంతో పోలీసులు ఎదుట లొంగిపోతున్నారు.  సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యులు లేదా వ్యక్తిగతంగా కోరడం, లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరపున పునరావాసం కల్పించడంతో కొంతమంది లొంగిపోయారు.

Scroll to Top