అంచలంచలుగా ఎదిగి AIUKS జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన “వి ప్రభాకర్ ”కు విప్లవ అభినందనలు
పయనించే సూర్యుడు 14 5 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : నిజాంబాద్ జిల్లా గడ్కోల్ ప్రభాకర్ గా సుమారు 5దశబ్దాలుగా నిజామాబాదు జిల్లాలో ముఖ్యంగా సిరికొండ, భీంగల్ ఆర్మూర్ ప్రాంతాల్లో పరిచయం అవసరం లేని ప్రజల మనిషి, AIUKS తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు,CPIML మాస్ లైన్ (ప్రజా పందా )రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు ఉప్పల ప్రభాకర్ అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS )జాతీయ స్థాయి ఉపాధ్యక్షులు కావడం గడ్కోల్ ప్రాంత ఉద్యమ రథ సారథి కి జాతీయ రైతు పోరాటాలకు నాయకత్వం వహించే బాధ్యత నివ్వడం ఈ ప్రాంత ఉద్యమానికి గర్వ కారణం .జాతీయ స్థాయిలో విడి విడి గా ఉన్న రైతు సంఘాలన్ని ఓకే వేదిక రైతుసంఘాలు ఐక్యత సాధించుటకు తన కృషి చేయగలని ఆకాంక్షిస్తూ కామ్రేడ్ గడ్కోల్ ప్రభాకర్ కి విప్లవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎమర్జెన్సీ తర్వాత 1977-78 లో గడ్కోల్ ఈ ప్రాంతానికి రైతు కూలీ ఉద్యమ అవసరాల కోసం వచ్చిన ఉప్పల ప్రభాకర్ వచ్చిన ఈ ప్రాంత ఉద్యమం ఆయనను గడ్కోల్ ప్రభాకర్ గా, వెనుక బడిన, దళితుల పక్ష పాతిగా నామకరణం చేసింది.సుమారు 2దశబ్దాలకు పైగా గడ్కోల్ కేంద్రం గా ఉంటూ రాత్రి బడులు నడుపుతూ, చుట్టూ గ్రామాల్లో,పాతభీమ్గల్ తాలూకాగ్రామాల్లో పెత్తందారుల ఆగడాలకు, ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యలకు వ్యతిరేకంగా ప్రజలను కూడ గట్టి జిల్లా వ్యాప్తంగా గడ్కోల్ రైతు కూలి సంఘముగా అనేక గ్రామాలకు విస్తరించిన ఉద్యమ ఘన చరిత్ర కు ఆయనే నాయకుడు. భీంగల్ ఆర్మూర్ కమ్మర్పల్లి, మోర్తాడ్ ప్రాంతంలో ఉద్యమాన్ని నష్ట పరుచుటకు పీపుల్స్ వార్ పేరిట దుందుడుకు చర్యలకు పాల్పడిన అరాచక ముఠాలను కళ్లెం వేసి ఎదురుకోవడానికి ఉద్యమ రక్షణ కై ఆయుధం పట్టిన దళ కమండర్ అయన ఈ ప్రాంత ఉద్యమానికి ఆనాటి నుండి నేటికీ కాపలా దారుడుగా ఉన్నాడు అనడం లో అతియోశక్తి లేదు. అనేక భూ పోరాటాలు చేసి ఈ ప్రాంతంలో సుమారు 1500ఎకరాల భూ పట్టాలు సాధించిన ఉద్యమాలకు సూత్రదారి. ఇంకా అనేక భూములు పట్టాల కోసం పట్టాలిచ్చిన sy no 532 సిర్కొండ, గడ్కోల్,అనేక గ్రామాల భూ సమస్యలకోసం నిత్యం అన్వేషణ కార్యక్రమం రూపొదించే నాయకుడు.ఎంత ఎదిగిన ఈ ప్రాంతం పైన దృష్టి, మమకారం మాత్రం లేదు. ఈ ప్రాంత ఉద్యమం తనను జాతీయ రైతు నాయకుడిగా గుర్తింపునకు ఈ ప్రాంత ఉద్యమానికి తగిన గౌరవం వచ్చిందని తెలుపుతూ మరోసారి కామ్రేడ్ గడ్కోల్ ప్రభాకర్ కి విప్లవఅభినందనలు తెలుపుతున్నాము.