ఏరుగట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల స్థాయి కార్యకర్తల సమావేశం

పయనించే సూర్యుడు 20 మే 20 26 నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్ టి కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో
ఈ రోజు ఏర్గట్ల మండల కేంద్రములో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సోమా దేవరెడ్డి సమక్షములో జరిగింది. ఇట్టి సమావేశము లో తెలంగాణా రాష్ట్ర పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ సభ్యులు గా బాస వేణు గోపాల్ యాదవ్ ని నూతనంగా ప్రభుత్వం నియమించిన సందర్భముగా అదే విధముగా రెండు రోజుల క్రింద ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా శివన్నోల్ల శివకుమార్ ని నూతనంగా కాంగ్రెస్ పార్టీ నియమించడంతో ఇద్దరిని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్ లు , ఉపసర్పంచులు ఘనముగా పూలమాల శాలువాలతో సన్మానించి అభినందించారు స్వీట్లు తినిపించారు. గడిచిన 10 సంవత్సరాల ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సోమ దేవరెడ్డి పార్టీ కి సేవ చేసి విరమణ చేస్తున్న సందర్భముగా సోమా దేవరెడ్డి కి సన్మానించారు. వీరు మాట్లాడుతూ ఈ పదవులు రావటానికి కృషి చేసిన టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్, ఈరవత్రి అనిల్ కుమార్, మానాల మోహన్ రెడ్డి, సుంకెట అన్వేష్ రెడ్డి కు కృతజ్ఞతలు తెలపారు. కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు సమయమును బట్టి న్యాయం జరగుతాదని ఓపిక పట్టాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాములో కాంగ్రెస్ ప్రజాపాలన జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకవెళ్లి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి సహకరించాలని కష్టపడి పని చెయ్యాలని సూచించారు. సంప్రదాయా ప్రకారం ప్రతిసారి వరుసగా 10 సంవత్సరాలు ఒకే ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం ఆచరణగా వస్తుందని ఇదే విషయాన్ని మొన్న రేవంత్ రెడ్డి చెప్పినట్లు 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వామే అధికారములో యుంటుదని అన్నారు. ఇట్టి సమావేశములో ఏర్గట్ల మండల కాంగ్రెస్ సర్పంచులు, ఉపసర్పంచ్ లు, తాళ్ల రాంపూర్ పీఏసీఎస్ ఛైర్మెన్, అన్ని గ్రామాల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు,కేఎంసీ డైరెక్టర్, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు