డి డి ఓ ఆకస్మిక తనిఖీలు

May 20, 2026 | సినిమా వార్తలు

పయానించే సూర్యుడు మే 20 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డి డి ఓ విజయభాస్కర్ బుధవారం కాట్రేనికోన మండలంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. కాట్రేనికోన గ్రామ పంచాయతీ లో “చెత్త నుండి సంపద తయారీ కేంద్రం” పరిశీలించారు. ప్రతీ బుధవారం నిర్వహించే ‘స్వచ్ఛ పదం” కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. అనంతరం మండల పరిషత్తు కార్యాలయంలో కార్యదర్శులతో సమావేశం అయ్యారు. పంచాయతీ కార్యదర్శులతో పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు, డిప్యూటీ ఎంపీడీఓలు ఎన్ శంకర నారాయణ, ఎస్ సూర్య నారాయణ రాజు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper