ఆక్వా పరిశ్ర‌మ‌లో తిష్ట‌వేసిన సిండికేట్ వ్య‌వ‌స్థ‌పై విచార‌ణ చేప‌ట్టి చ‌ర్య‌లు తీసుకోవాలి…

May 25, 2026 | సినిమా వార్తలు

కోన‌సీమ జిల్లా క‌లెక్ట‌ర్‌కు నివేదించిన ఆక్వా రైతు సంఘ నాయ‌కులు


పయనించే సూర్యుడు మే 25 (ముమ్మిడివరం ప్రతినిధి) క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ఫ్ల‌కార్డుల‌తో నిర‌స‌న‌.. ఫీడ్‌, ఎక్స్‌ఫోర్ట‌ర్ల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు..ప్ర‌భుత్వం ఆదుకోకుంటే సాగును మూకుమ్మ‌డిగా మానుకుంటామ‌న్న రైతులు అమ‌లాపురం, ఆక్వా రైతులను నిలువునా ముంచుతున్న ఫీడ్ కంపెనీలు, ఎక్స్‌పోర్టర్ల “సిండికేట్ వ్యవస్థ” పై తక్షణ విచారణ చేపట్టి, ఆక్వా రైతులకు మేలు చేయడంతోపాటు ధరల క్రమబద్ధీకరణ చేయాలని అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా క‌లెక్ట‌ర్‌కు అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా ఆక్వా రైతు సంఘ నాయ‌కులు జిల్లా క‌లెక్ట‌ర్‌కు విన‌తి ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో నిర్వ‌హించే ప్ర‌జా ఫిర్యాదుల వేదిక వ‌ద్ద‌కు త‌ర‌లివచ్చిన ఆక్వారైతులు సిండికేట్ వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేసుకుంటూ క‌లెక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లారు. రాష్ట్రంలో సరైన ఉపాధి అవకాశాలు లేక, కన్నతల్లి లాంటి సొంత ఊరిని వదిలి పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళలేక, ఉన్నత విద్యావంతులైన ఎంతోమంది యువకులు నేడు కోనసీమ ప్రాంతంలో రొయ్యల సాగును ఒక కుటీర పరిశ్రమగా నమ్ముకుని జీవనం సాగిస్తున్నారని, దేశీయ రొయ్యల ఉత్పత్తిలో దాదాపు 30% వాటా కేవలం ఉభయ గోదావరి జిల్లాల నుంచే వస్తోండ‌గా ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ రంగాన్ని నమ్ముకున్న వేలాది మంది రైతులు నేడు ఒక మాఫియా లాంటి “సిండికేట్” చేతిలో చిక్కి విలవిలలాడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. రొయ్యల కొనుగోలు ధరలను పెంచాలని డిమాండ్ చేస్తూ కోన‌సీమ ఆక్వా సంఘ అధ్య‌క్షుడు దెందుకూరి సత్తిబాబు రాజు, ఆక్వారైతు రాష్ట్ర నాయ‌కుడు త్స‌వ‌ట‌ప‌ల్లి నాగభూషణం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ‌క్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ సిండికేట్ వ్య‌వ‌స్థ‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా సంఘ అధ్య‌క్షుడు సత్తిబాబు రాజు మాట్లాడుతూ సిండికేట్ వ్యవస్థ కారణంగా ఆక్వా రంగం తీవ్రంగా నష్టపోతుందని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సిండికేట్‌ను రూపుమాపాల‌ని డిమాండ్ చేశారు.ఆక్వాను న‌మ్ముకున్న రైతుల‌ను నిలువునా మోసం చేయ‌డం వ‌ల్ల దిక్కుతోచ‌ని దుస్థితిలో యావ‌త్ రైతాంగం ఉంద‌ని, కిలోకు రూ. 50 నుంచి 70 వ‌ర‌కు త‌గ్గించి కొనుగోలు చేయ‌డం వ‌ల్ల ఈ న‌ష్టం రైతు భ‌రించాల్సి వ‌స్తోంద‌న్నారు. హేచ‌రీ దారులు, మేత‌ల త‌యారీ దారులు అంతా లాభాల‌కు అమ్ముకుంటున్నార‌ని, కానీ రైతు మాత్రం న‌ష్టానికే తాను పండించిన పంట‌ను అమ్ముకోవాల్సి వ‌స్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌గ్గించిన రొయ్య‌ల‌ ధ‌ర‌ల‌ను వెంట‌నే పెంచ‌క‌పోతే మూకుమ్మ‌డిగా ఆక్వాసాగును మానుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నార‌న్నారు. ఆక్వా రైతు సంఘ నాయ‌కుడు త్స‌వ‌ట‌ప‌ల్లి నాగ‌భూష‌ణం మాట్లాడుతూ తాము నిర్ణయించిన ధరకే ఫీడ్ కొనాలి.. మేము అడిగిన ధరకే రొయ్యలు అమ్మాలి” అనే రీతిలో ఈ సిండికేట్ వ్యవస్థ నడుస్తోందని, వీరు కాదంటే రైతుకు మరో గత్యంతరం లేని భయానక వాతావరణాన్ని మార్కెట్‌లో సృష్టించారని ఇది చాలా దారుణ‌మైన చ‌ర్య‌గా ఆయ‌న పేర్కొన్నారు. దీనివల్ల పెట్టుబడులు పెట్టడమే గాక, తెచ్చిన అప్పులు తీర్చలేక ఆక్వా రైతాంగం తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలే శ‌ర‌ణ్యంగా అయిన ప‌రిస్థితి రైతులు ఎదుర్కుంటున్నార‌న్నారు. ప్ర‌భుత్వం వెంట‌నే జోక్యం చేసుకుని సిండికేట్ వ్య‌వ‌స్థ‌ను రూపుమాపి రైతుల‌ను న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. ట్రంప్ ట్యాక్స్ వంక పెట్టి రైతుల వ‌ద్ద‌నుంచి లాగిన రూ.25 వేల కోట్లు రైతుల‌కు తిరిగి ఇవ్వాల‌ని, ఈ మ‌థ్య కాలంలో లేబ‌ర్ షార్టేజీ అని చెప్పి ట‌న్నుకు రూ.50 వేలు చొప్ప‌న లాగిన ఈ డ‌బ్బును కూడా రైతుల‌కు ప్ర‌భుత్వం తిరిగి ఇప్పించి రైతు ప‌క్ష‌పాతిగా ముఖ్య‌మంత్రి చంద్రాబు రైతుల మ‌న్న‌న‌ను పొందాల‌న్నారు. విద్యుత్తు స‌బ్సి డీ విష‌యంలో ఎన్నిక‌ల ఆక్వా జోన్ అనే మాట లేకుండా రూ.1.50 పైస‌లకు కరెంటు వ‌చ్చే బిల్లు నుంచి అంద‌రికీ వ‌ర్తింప‌చేసేలా చేయాల‌ని కోరారు. విదేశీ మార‌క ద్ర‌వ్యం తీసుకొచ్చే డాల‌ర్ల పంట‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్ల దేశం న‌ష్ట‌పోతుంద‌న్నారు. ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీ ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కళ్యాణ్ ప‌రామ‌ర్శ‌కు వ‌చ్చిన సంద‌ర్భంలో ఒక ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయ‌వ‌ద్ద‌ని సూచించార‌ని, అయితే ఎటువంటి స‌హాయ స‌హ‌కారాలు అంద‌న‌ప్ప‌టికీ అత్య‌ధికంగా డాల‌ర్లు తీసుకువ‌చ్చే పంట అయిన ఆక్వా ప‌రిశ్ర‌మ‌కు రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాల నుంచి ఎటువంటి సహ‌కారం అంద‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. వరుస న‌ష్టాల‌తో ఆక్వా ప‌రిశ్ర‌మ దెబ్బ‌తింటే ఇదే డాల‌రు మార‌క విలువ‌ రూ.96 ఉన్న‌ది కాస్త‌ రూ.100 కు పైగా ఎగ‌బాకే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్నారు. విదేశీ పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేందుకు కోట్లు విలువైన భూమిని పెట్టుబ‌డి దారుల‌కు కూట‌మి ప్ర‌భుత్వం ఇచ్చి వాటిలో మౌలిక స‌దుపాయాల‌న్నీ స‌మ‌కూర్చుతోంద‌ని, కానీ ఏ విధ‌మైన స‌హ‌కారం లేకపోయిన ఆక్వా ప‌రిశ్ర‌మ డాల‌ర్ల‌ను దేశానికి తేవ‌డమే కాక‌, ఎంతో మందికి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తుంద‌న్నారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో ఆక్వా రైతుల సంఘ జిల్లా అధ్య‌క్షుడు దెందుకూరి స‌త్తిబాబు, రైతు సంఘ నాయ‌కుడు త్స‌వ‌ట‌ప‌ల్లి నాగ‌భూష‌ణం, జిల్లా కార్య‌ద‌ర్శి త్స‌వ‌ట‌ప‌ల్లి మ‌ణికుమార్‌, మోటూరి నాని, రుద్ర‌రాజు కాశీ రాజు, గుండిపూడి బాల‌, సూదా ర‌ఘ‌వేంద్ర‌, కోటిప‌ల్లి స‌తీష్‌, టి.శ్రీ‌నివాసరావు, మేక‌ల గురు, మేడిద శంక‌ర‌రావు, క‌డ‌లి వెంక‌టేశ్వ‌ర‌ రావు, ప‌చ్చిమ‌ల ఏడుకొండ‌లు, నంద్యాల వెంక‌టేశ్వ‌ర‌రావు, గాలిదేవ‌ర గంగాధ‌ర రామారావు, ఆకేటి పెద్ద, న‌ల్లా ఏడుకొండ‌లు, కుర‌సా కృష్ణ, బ‌స‌వా ముర‌ళి, త‌దిత‌రులు పాల్గొన్నారు..

🌐 Select Language:
📰 ePaper