జడ్.పి.హెచ్.ఎస్ బూర్గుల లో ముగిసిన వేసవి శిక్షణ తరగతులు

వివిధ రకాల శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు
( పయనించే సూర్యుడు మే 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ బూర్గుల పీఎం శ్రీ పాఠశాలలో గత 15 రోజులుగా జరుగుతున్న వేసవి శిక్షణ తరగతులు నేటితో ముగిశాయి. ఈ వేసవి శిక్షణ లో యోగా, డాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఇండోర్ గేమ్స్ మరియు మ్యూజిక్ మొదలైన వాటిలో విద్యార్థులకు గత 15 రోజులుగా శిక్షణలు ఇవ్వడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్ మాట్లాడుతూ… విద్యార్థులు ఈ 15 రోజుల శిక్షణ తరగతులను చక్కగా వినియోగించుకున్నారని డాన్స్ యోగ ఆటల వల్ల విద్యార్థుల్లో నేర్చుకోవాలని తపన మెరుగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రవికుమార్ మరియు మాస్టర్ నరేందర్ నాయక్, యోగా ఇన్స్పెక్టర్ కుమారస్వామి ఉపాధ్యాయురాలు సంధ్యారాణి, సునీత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.