తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, జనసైనికులు, వీరమహిళలు.

June 2, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు హైదరాబాద్‌లోని కె పి హెచ్ బీ ఐదవ ఫేజ్‌లో తెలంగాణ జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు, జనసైనికులు, వీరమహిళలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఎన్నో దశాబ్దాల ప్రజా పోరాటాల ఫలితమని, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, రైతులు, మహిళలు మరియు వివిధ ప్రజా సంఘాలు చేసిన త్యాగాలు, ఉద్యమాలు, నిరాహార దీక్షలు, ఆందోళనల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను ఎప్పటికీ మరువలేమని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి జరగాలని, యువతకు ఉపాధి అవకాశాలు, రైతులకు భరోసా, మహిళలకు రక్షణ మరియు అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా పాలన సాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన, సామాజిక న్యాయం మరియు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper