విట్టాపూర్‌లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు.

June 2, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు కుంటాల మండలంలోని విట్టాపూర్ గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించి, నూతన గృహాల్లోకి ప్రవేశించిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం పేద ప్రజలకు సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వలు కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన ఆర్థిక సహాయ చెక్కును, కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper