ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భముగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి పాల్గొన్నారు

June 5, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు 5 6 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ; భీంగల్ పట్టణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ ఆధ్వర్యంలో పదో వార్డ్ ఎస్సీ కాలనీలోని మహిళా బిల్డింగ్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగిందని కమిషనర్ డి. గజానంద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రకృతి మనకు జీవనాధారం, స్ఫూర్తి, భవిష్యత్తుకు మార్గదర్శకం. నేడు వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి అని అన్నారు. ఒక మొక్క నాటడం, నీటిని ఆదా చేయడం, కాలుష్యాన్ని తగ్గించడం వంటి చిన్నచిన్న చర్యలే రేపటి తరాలకు సురక్షితమైన, స్వచ్ఛమైన భూమిని అందించగలవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కౌన్సిలర్లు జె జె నర్యయ్య. నీలం రవి. మేనేజర్ నరేందర్ మున్సిపల్ సిబ్బంది మెప్మా సిబ్బంది మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper