మండుటెండల్లో మానవత్వం చాటుతున్న గాయత్రి బ్రాహ్మణ సేవా సమైక్య

June 5, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు జూన్ 5 (సూళ్లూరుపేట నియోజక వర్గ0 రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో షార్‌ బస్ స్టాండ్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో గత 10 రోజులుగా ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. మండుటెండల్లో దాహంతో అలమటిస్తున్న ప్రయాణికులు, కార్మికులు, ప్రజలకు బ్రాహ్మణ కుటుంబాలు చేయి చేయి కలిపి చల్లని మజ్జిగ అందిస్తూ సేవాభావాన్ని చాటుతున్నాయి. ఈ కార్యక్రమంలో మల్లిస్వామి, బీవీ సుబ్బారావు, విప్పగుంట శివకుమార్, కిడాంబి మురళీధర్, హరగోపాల్ తదితరులు చురుకుగా పాల్గొని మజ్జిగ వితరణ నిర్వహిస్తున్నారు. నిరంతరంగా సాగుతున్న ఈ సేవా కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ, ప్రశంసలు లభిస్తున్నాయి.

🌐 Select Language:
📰 ePaper