ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు( బుచ్చిబాబు) ప్రజాదర్బార్
పయ నించు సూర్యుడు జూన్ 5 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) *ప్రజాదర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే & ప్రభుత్వ చీఫ్ విప్ దాట్ల సుబ్బరాజు( బుచ్చిబాబు) అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమళ్ళ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, సంక్షేమ పథకాలు మరియు ఇతర ప్రజా సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజలు ఎమ్మెల్యేకు సమర్పించారు. ప్రతి అర్జీని పరిశీలించినతక్షణం పరిష్కరించగలిగిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించారు.మరిన్ని సమస్యలను ఆన్లైన్ ద్వారా నమోదు చేయాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా శాసనసభ్యులు తెలిపారు.మరి కొన్ని సమస్యలను ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎమ్మెల్యే వివేకానంద జనసేన నాయకుడు జమ్మి తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.