రైతులను మోసం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం

June 8, 2026 | తెలంగాణ

*స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి*

పయనించే సూర్యుడు 8 6 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్*AIUKS రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి దేవారం*తేదీ 06:06:2026 నాడు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా అనుబంధ అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో జాతీయ మహాసభ పిలుపుమేరకు నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. *ఈ ధర్నాలో అఖిలభారత ఐక్య వైద్య సంఘం (ఏఐయుకేఎస్)రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్, కార్యదర్శి బి దేవారం మాట్లాడుతూ* కేంద్రం లోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవసాయ రంగం పై కత్తి కట్టి పని చేస్తున్నారన్నారు. కేంద్ర ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం ( సిసిఈపి) 14 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలు ( యంఎసిపి) 2026-27 సం.లనకు పెంచడానికి నిర్ణయం తీసుకుంది. 12 సంవత్సరాల క్రితం అధికారంలోకి రాకపూర్వం స్వామినాథన్ కమిటీ సిఫారసులను అనుసరించి సమగ్ర వ్యవసాయ ఉత్పత్తి ఖర్చుల ప్రాతిపదికన కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తామని కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ ఏనాడు ఆ ఊసుకే పోలేదు. దేశ రైతాంగం యావత్తు రోడ్డుపైకెక్కి ఆందోళనకు పూనుకున్నా కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తూ వస్తున్నది. విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగుమందులు, కూలీల వేతనాలు, డీజిల్, విద్యుత్తు, సాగునీరు మొదలైన ఉత్పత్తి కారకాల ధరలు ఆకాశానికి అంటుతున్నా వీటిని పరిగణలోకి తీసుకోకుండా యంఎస్పి ఎ2+ఎఫ్ఎల్ ప్రకారం నిర్ణయించారు. ఇది సాధారణంగా సి2 కంటే సుమారు 30% తక్కువ. అయినా ప్రభుత్వం తనను తాను సమర్ధించుకోవడం సిగ్గుచేటు.రైతులకు లాభదాయక ధరలు ఇస్తున్నట్టుగా వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ వాదిస్తోంది. ఉత్పత్తి ఖర్చులు సంవత్సరానికి సంవత్సరం పెరిగిపోతున్నాయి. దానితో ప్రభుత్వం ప్రకటించే ఎం ఎస్ పి కి రైతులు పెట్టిన పెట్టుబడులకు ఏమాత్రం పొసగడం లేదు. తీరా పండించిన పంటను మార్కెట్లకు తీసుకెళ్తే ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరలకే మధ్య దళారీలకు రైతులు బలవంతాన అమ్ముకోవాల్సి వస్తున్నది. ప్రభుత్వం వరి మొక్కజొన్న పత్తి కంది లాంటి పంటలకు ఏ సీజన్లో కూడా కొనుగోలు కేంద్రాలను సకాలంలో తెరిచింది లేదు. రైతులు యంఎస్పి కంటే తక్కువ ధరకు కమిషన్ ఏజెంట్లకు అమ్ముకొని నష్టపోతున్నా పట్టించుకున్న పాపాన పోరు. రైతులు ప్రతి సీజన్లో ఆందోళనకు దిగితేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నాయి. ఇది వాస్తవం కాదా? ఇప్పటికైనా రైతు సమస్యలు పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో అఖిలభారత ఐక్య వైద్య సంఘం (ఏఐయుకేఎస్) జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, ప్రధాన కార్యదర్శి బి బాబన్న లు మాట్లాడగా, ఉపాధ్యక్షులు యు. రాజన్న, ఏపి గంగారాం, సహాయ కార్యదర్శులు ఆర్ దామోదర్, బి కిషన్, నాయకులు ఏ సాయిలు, ఇ రమేష్ తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper