PS Telugu News
Epaper

60 ఏళ్ల ఆమె–45 ఏళ్ల అతని ప్రేమ ప్రయాణం… చివరకు అప్రత్యక్ష పరిణామం

📅 26 Nov 2025 ⏱️ 11:36 AM 📝 క్రైమ్-న్యూస్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :ఆమెకు 60 ఏళ్లు. కూతురు పెళ్లిని ఇమ్రాన్ అనే 45ఏళ్ల వ్యక్తి ఫిక్స్ చేశాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ మహిళ అతడిపై ఒత్తిడి తెచ్చింది. అప్పటికే ఆ వ్యక్తికి భార్య, పిల్లలు ఉన్నారు. దీంతో అతడు ఏం చేశాడంటే..ప్రేమ వ్యవహారం చిలికి చిలికి గాలివానై ఒక దారుణమైన హత్యకు దారితీసింది. 60 ఏళ్ల తన మహిళను చంపిన కేసులో ఇమ్రాన్ (45) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 14న హత్రాస్‌లోని రోడ్డు పక్కన ఒక మహిళ మృతదేహం కనిపించింది. ఆ మహిళ ఎవరో, ఆమెను ఎవరు చంపారో తెలుసుకోవడానికి పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేశారు. దాదాపు ఐదు జిల్లాల్లో 1,000 సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఎట్టకేలకు మరణించిన మహిళను కోల్‌కతాకు చెందిన జోషినా(60) గా గుర్తించారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.కోల్‌కతాలో నివసిస్తున్న జోషినా కుమార్తె ముంతాజ్‌కు, ఆగ్రా నివాసి సత్తార్‌తో ఇమ్రాన్ వివాహం ఏర్పాటు చేశాడు. ఇమ్రాన్ మామ పశ్చిమ బెంగాల్‌లోని జోషినా ఇంటికి సమీపంలోనే ఉండేవారు. దీంతో ఇమ్రాన్, జోషినా మధ్య పరిచయం పెరిగి.. ప్రేమగా మారింది. కూతురు పెళ్లి నేపథ్యంలో జోషినా కోల్‌కతా నుండి ఆగ్రాకు వచ్చింది. ఈ సమయంలో జోషినా ఇమ్రాన్ ఇంటికి వెళ్లి తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అయితే ఇమ్రాన్‌కు అప్పటికే భార్య, పిల్లలు ఉండటంతో, అతను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు.ఈ క్రమంలో జోషినాను ఎలాగైన వదిలించుకోవాలని దారుణానికి ఒడిగట్టాడు ఇమ్రాన్. నవంబర్ 13న, జోషినాను కోల్‌కతాకు తిరిగి పంపించే నెపంతో ఇమ్రాన్ ఆమెను ఆగ్రా నుండి బస్సు ఎక్కించాడు.కానీ, పశ్చిమ బెంగాల్‌కు వెళ్లే బస్సు ఎక్కకుండా, ఆగ్రా వైపు వెళ్లే బస్సులో ఎక్కాడు. దారిలో హత్రాస్‌లోని నాగ్లా భూస్ దగ్గర ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరూ దిగారు. అక్కడ జోషినా గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుండి పారిపోయాడు. రెండు రోజుల క్రితం పోలీసులు ఇమ్రాన్‌ను ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌లోని హతిసా బ్రిడ్జి దగ్గర అరెస్టు చేశారు.


Scroll to Top