మహిళల అభివృద్ది యే గ్రామాల అభివృద్ధి -మహిళా సంఘ భవనాలు త్వరితగతిన పూర్తి చేయాలి.
పయనించే సూర్యుడు D.06.06.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ : -గంగుల సంతోష్ కుమార్ ఎంపీడీవో
భీంగల్ మండలం పురానిపేట కుప్కాల్ గ్రామాలలో గ్రామ ఐక్య మహిళా సంఘాల VO భవనాలకు భూమి పూజ నిర్వహించడం జరిగింది.. ప్రతి గ్రామంలో మహిళల కోసం ప్రత్యేక భవనం ఉండాలని ప్రభుత్వ ఉద్దేశం అనుసరించి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి పది లక్షల రూపాయల నిధులతో పైన తెలిపిన గ్రామాలలో భవనాలకు భూమి పూజ నిర్వహించడం జరిగింది,కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్ కుమార్ ,DEE రమేష్ భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ టౌన్ ప్రెసిడెంట్ అనంతరావు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు ఏపిఎం ప్రమీల సీసీలు శ్రీనివాస్,రఘు, నరేష్, ,వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శులు మహిళా సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు