చెరువులని కబ్జా చేసి పెద్ద పెద్ద భవంతులు వెలిశాయి
పయనించే సూర్యుడు జూన్ 8 (సూళ్లూరుపేట నియోజక వర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలోని ఉన్న పడమటి కండ్రిగ, ఎర్ర పాలెం ,సాయి నగర్, డేగల పాలెం, కసారెడ్డి పాలెం, చెరువులు, గుంటలు , కాలువలు కబ్జా గురయ్యాయి కబ్జా చేసిన వారు పెద్ద పెద్ద ఇంద్రభవనం లాగా బిల్డింగులు నిర్మించి ఉన్నారు ఆ బిల్డింగులకి మున్సిపాలిటీ అధికారులు ప్లానింగ్ ఎలా మంజూరు చేశారు చెరువుల్లో కాలవల్లో ఇల్లు కట్టుకోవడానికి మంజూరు చేసిన దానికి ఏంత ముడుపులు అందుకున్నారో లేక రాజకీయ నాయకుల వత్తుల్లో మంజూరు చేశారా ఆ చెరువుల్లో కాలవల్లో స్థలాలకి రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు రిజిస్ట్రేషన్ లేకుండా ప్లానింగ్ ఎలా అప్రూవ్ అవుతుంది రిజిస్ట్రేషన్ చేసిందానికి రిజిస్టర్ కి ఎంత ముడుపులు అందాయో మున్సిపాలిటీ వారు చెరువులు కాలువలా స్థలాలకి రోడ్ల ఎలా వేస్తారు డ్రైనేజ్ కాలువలు ఎలా నిర్మిస్తారు వీటన్నిటికీ ఎవరు అప్రూవల్ ఇచ్చారు విద్యుత్ అధికారులు ఇంటి పట్టా ఆధారం లేకుండా ఏ ఆధారాలతో విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారు సూళ్లూరుపేట మండలంలో ఏ పర్మిషన్ లేకుండా చెరువుల్లో మనం ఏమైనా చేయొచ్చా ఇన్ని జరుగుతున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మనకెందుకులే అని చూసి చూడనట్లు ఉండటానికి కారణాలేంటి ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం తప్పిదం వల్ల సూళ్లూరుపేట నియోజవర్గంలోని మండలంలో చెరువులు కబ్జా గురించి నీటి ప్రవాహం ఉద్రిక్తమై వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏటా ఇబ్బంది గురవుతున్నారు పంట నష్టం వచ్చి ఆస్తిపాస్తులు నాశనం చేస్తుంది వర్షాకాలం వచ్చిందంటే సూళ్లూరుపేట మొత్తం జలమయంతో నిండిపోతుంది ప్రజల పడుతున్న ఇబ్బందులు అధికారుల కంటికి కనిపించవు అధికార తప్పిదం వల్ల చెరువులు మాయమైపోతున్నాయి చెరువులు ఉంటే కదా పడిన వర్షపు నీరు చెరువుల్లో స్టాక్ అవుతుంది ఇప్పుడేమో బిందు పది రూపాయలకు కొనుక్కుంటున్నాం నీళ్లు స్టాక్ లేక మాయమైపోతే బింది ₹100 కొనే దిష్టి వస్తుంది సూళ్లూరు పేట ప్రజలకి ఇలా జరగకుండా ఉండాలంటే చెరువులను కాపాడండి చెరువుల వల్ల సూళ్లూరుపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుంది సూళ్లూరుపేట చుట్టుపక్కల వేళ్ళ ఎకరాలు సాగు చేస్తున్న రైతులు కూడా ఎంతో నష్టం ఏర్పడుతుంది కనుక చెరువులను కాపాడండి మహాప్రభు అని సూళ్లూరు పేట ప్రజలు వేడుకుంటున్నారు