విశాఖ–బెంగళూరు మార్గాన వందేభారత్ స్లీపర్ రైలు సేవల పట్ల హర్షం.
మార్కాపురంలో స్టాప్ కల్పించాలని కేంద్ర రైల్వే శాఖకు
పయనించు సూర్యుడు ఆగస్టు 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి.పయనించే సూర్యుడువిశాఖపట్నం–బెంగళూరు మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరో శుభవార్త అందించిందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి తెలిపారు.ఈ మార్గంలో అత్యాధునిక సౌకర్యాలతో వందేభారత్ స్లీపర్ రైలు సేవలు ప్రారంభం కానుండటం పై ఆయన హర్షం వ్యక్తం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ రైల్వే వ్యవస్థను ఆధునికీకరిస్తూ, ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవలను అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందన్నారు. వందేభారత్ స్లీపర్ రైలు సేవలు ప్రారంభం కావడం వల్ల విశాఖపట్నం–బెంగళూరు మధ్య ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, సాధారణ ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.ఈ నూతన రైలు సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే, దేశ రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ ఆధునిక రవాణా సౌకర్యాలను విస్తరిస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన కేంద్ర రైల్వే శాఖకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం–బెంగళూరు వందేభారత్ స్లీపర్ రైలుకు ప్రకాశం జిల్లా కేంద్రం మార్కాపురంలో స్టాప్ కల్పించాలని కోరారు. మార్కాపురం ప్రాంత ప్రజలతో పాటు, శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే వేలాది మంది భక్తులకు ఈ స్టాప్ ఎంతో ఉపయోగకరం గా ఉంటుందని పేర్కొన్నారు. మార్కాపురం రైల్వే స్టేషన్కు ఈ రైలు నిలుపుదల కల్పిస్తే ప్రకాశం, నంద్యాల పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ప్రయాణ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రా రెడ్డి అభిప్రాయపడ్డారు.