గున్నేపల్లి సత్తేమ్మ తల్లికి వైభవంగా ఆషాడం సారె.

August 5, 2026 | సినిమా వార్తలు

పయనించు సూర్యుడు ఆగస్టు ఇది ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ)ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ వనుములమ్మ తల్లికి సారె సమర్పించి అక్కడనుండి గ్రామోత్సవముగా ఊరి ఆడపడుచులు వివిధ మండలాలు జిల్లాల నుండి విచ్చేసిన మాతృమూర్తులు అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు చలివిడి పానకం వివిధ రకాల పిండివంటలతో గరగ నృత్యాలతో మేళ తాళాలతో కోనసీమ కొంగుబంగారంగా విరాజిల్లుతున్న సిహెచ్ గున్నేపల్లి సత్తెమ్మ తల్లి ఆలయము చేరి అమ్మని దర్శించుకుని సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఆలయ కమిటీ వారు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసి భక్తులందరికీ అమ్మవారి సారె పంచినారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక సేవకులు గొలకోటి వెంకటరెడ్డి మాట్లాడుతూ అమ్మ ఎంతో మహిమాన్వితమైనది అమ్మని దర్శించుకుని మనస్ఫూర్తిగా అమ్మని కోరిక కోరుకుంటే నెరవేరుతుందన్నారు ధర్మ ప్రచారకులు బి కనకారావు అమ్మవారిని ఊరి ఆడపడుచు గా భావించి సారె సమర్పించడం వలన అమ్మ దయతో గ్రామం సుభిక్షంగా ఉంటుంది సకల ఐశ్వర్యములు కలుగుతాయి అన్నారు . ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు గ్రామస్తులు వచ్చిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.

🌐 Select Language:
📰 ePaper