ఏరుగట్ల మండలంగు మిర్యాల్ మరియు నాగేంద్ర నగర్ గ్రామాలలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం.

June 24, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.24.06.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్..ఈ రోజు బుధవారం రోజున ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల్ గ్రామములో మరియు నాగేంద్ర నగర్ గ్రామములో గ్రామ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది, ఇట్టి సమావేశములో గ్రామ కాంగ్రెస్ కమిటీలు, మండల కాంగ్రెస్ కమిటీలు, యూత్ కాంగ్రెస్ కమిటీల గురించి అక్కడి నాయకుల, కార్యకర్తల అభీష్టం మేర నిర్ణయం తీసుకొని అదిష్టానికి పంపి వాళ్ళ నిర్ణయం మేర ప్రకటించడం జరుగుతుంది అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్ తెలిపారు. సమావేశాలను ఉద్దేశించి శివన్నోల్ల శివకుమార్, సోమ దేవరెడ్డి మాట్లాడుతూ మన దగ్గర ఇప్పుడు ఎరువుల కొరత లేదని, అన్ని సొసైటీ లకు, పర్టీలైజర్లకు ఎన్ని అడిగితే అన్ని అడ్వాన్స్ గా అలర్ట్మెంట్ ప్రభుత్వం ఇచ్చిందని యాప్ ద్వారా రైతులు బుక్ చేసుకున్న తర్వాత సొసైటీ లో డబ్బులు కట్టగానే వస్తుందని అన్నారు. కొన్ని సొసైటీ లు అప్పులు చేసి డిపాట్లు అయినందున రైతుల డిమాండ్ మేర సమయానికి డబ్బులు కట్టకుండా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్లు రైతుల డిమాండ్ బట్టి సరిపడా ఎరువులు ఇవ్వకపోవడం వల్లనే యాప్ ద్వారా అందజేయటం జరుగుతుందని, ఈ యాప్ మన ఒక్క రాష్ట్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాలలో యున్న విషయం మర్చిపోవద్దు దీనికి కారణం కేంద్రమే. ఎకరం నుండి ఎన్ని ఎకరాలు యున్న అవసరం యున్నవారందరికీ ఒకేసారి సమానముగా అందజేయాలని ఎరువుల దళారీ వ్యవస్థ నిర్మూలించాలని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నని అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రతి పక్షాలు రైతులను రెచ్చగొట్టి అయోమయానికి గురి చేస్తున్నాయని, గతములో BRS పాలనలో ఎరువుల కోసం గంటలు రోజుల కొద్ది రైతులు లైన్లలో యున్నది, పాసుబుక్ లు, చెప్పులు పెట్టి రైతులు ఎదురు చూసిన రోజులు ఇంకా మర్చిపోలేరు. వడ్లు వేస్తే ఊరే అన్నది కూడా గుర్తుందని గుర్తు చేశారు. ఎరువుల యాప్ ఏది కొత్తగా వచ్చిన కొన్ని సాంకేతిక సమస్యలు యుంటాయి, ప్రభుత్వాలు ప్రజల కోరిక మేర సరిదిద్దుతారని, యాప్ మొదట వచ్చినప్పటికీ ఇప్పటికీ మార్పులు చేశారని ఇంకా మార్పులు చేసి సులువుగా చేసి ప్రతి రైతుకు అందచెయ్యడానికి రేవంతన్న ప్రజాపాలన ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఎరువుల వాడకాన్ని తగ్గించాలని రాష్ట్రాలకు తక్కువగా పంపియ్యడం వల్లే ఈ సమస్యలు ఉత్ప్నమౌతుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల రేట్లు రెండు ఇంతలు పెంచిందని అలాగే డిజిల్, పెట్రోల్ ధరలు కూడా విపరీతంగా పెంచారని రైతాంగంతో పాటు పేద మధ్యతరగతి ప్రజలను బాధపెడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి అవసరమైన ఎరువులను సరఫరా చేస్తూ పెంచిన ధరలను తగ్గించాలని అదే విధముగా క్రూడ ఆయిల్ బాగా తగ్గింది కాబట్టి డిజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో గుమ్మిర్యాల్, తోర్తి, నాగేంద్ర నగర్ సర్పంచులు దేవన్న, భూమేష్, రంజిత్, ఉపసర్పంచులు కిషోర్,సుమన్, జాకీర్, తోర్తి గంగా మోహన్. ఏనెండ్ల రాకేష్, కాటిపల్లి రఘుపతి, షెంసన్, ముక్కెర గజేందర్ యాదవ్, అనిల్ యాదవ్, కాటిపల్లి దేవన్న, పన్నాల నర్సారెడ్డి, కమ్మరి హరీష్, గంగా భూమన్న, ఇనర్ల శ్రీనివాస్, కమ్మరి ముత్తెన్న, సోమ రాకేష్, భార్గవ్, వకీల్, బోడ రాజ్, రవి గౌడ్, షార్క్, నాగిద్, మల్లేష్, బోడా గణేష్, కుశ మోహన్ , రెండు గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper