హసన్ బాద పంచాయతీ పరిధిలో మన ఊరు మన జెండా కార్యక్రమం
పయనించు సూర్యుడు జూన్ 24 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) రామచంద్రపురం మండలం హసన్ బాద గ్రామంలో మన ఊరు మన జెండా బిజెపి జెండా స్థూపం వద్ద, 88,89 బూత్ లలో మండల బిజెపి అధ్యక్షులు ఆకేటి శ్రీకృష్ణ, కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి సతీష్ రావు ఆధ్వర్యంలో జూన్ 23 వ తేదీన జనసంఘ్ వ్యస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.భారత ఏకత్వం,జాతీయ సమగ్రత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. అని,భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు వారి వర్ధంతిని మండల బిజెపి అధ్యక్షులు ఆకేటి శ్రీకృష్ణ ఆధ్వర్యంలో రామచంద్రపురం రూరల్ లో ప్రతీ పోలింగ్ బూతులోను నిర్వహించి ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నామని కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి సతీష్ రావు తెలియజేశారు.దేశం కోసం ఆయన చేసిన త్యాగాలు,సేవలు, జాతీయవాద భావాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాల సాధనకు మనమందరం కృషి చేద్దామని పేర్కొన్నారు.డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 1953 జూన్ 23న జమ్మూ కాశ్మీర్‌లో నిర్బంధంలో ఉన్న సమయంలో మరణించారని ఆయన భారతీయ జనసంఘ్ స్థాపకులు,భారత సమగ్రత కోసం ఉద్యమించిన ప్రముఖ నాయకులలో ఒకరని సతీష్ రావు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హసన్ బాద గ్రామ కిసాన్ మోర్చ కమిటీ అధ్యక్షులు చోడిశెట్టి దశరథ రామారావు, ఉపాధ్యక్షులు భలే బాబూరావు,బిజెపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.