మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన ముదిరాజ్ సంఘం నేతలు

June 25, 2026 | తెలంగాణ

*మత్స్యశాఖ సహకారంపై వినతి*

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 25మక్తల్: హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర పాడి, పశుసంవర్ధక, క్రీడా, డెయిరీ, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరిని ముదిరాజ్ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మత్స్యశాఖ ద్వారా అందించే సహకారానికి సంబంధించిన పలు అంశాలపై సొసైటీ అధ్యక్షుడు సిరిపే వెంకటప్ప ముదిరాజ్, బీసీ సేన నారాయణపేట జిల్లా అధ్యక్షుడు చేలేటి వెంకటేష్ ముదిరాజ్ మంత్రికి వివరించి వినతిపత్రం అందజేశారు. మత్స్యకారుల సంక్షేమం, సొసైటీల అభివృద్ధికి తగిన సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. మంత్రి శ్రీహరి సానుకూలంగా స్పందిస్తూ, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper