బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులకు ముఖ్య గమనిక..

June 25, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.25.06.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : ​కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (SIR) కార్యక్రమం నేటి నుండి ప్రారంభమైంది.​మన బాల్కొండ నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAs) అందరూ ఈ క్రింది అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పని చేయాలి:​కొత్త ఓటర్ల నమోదు: 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడికి ఓటు హక్కు కల్పించడం.తప్పుల సవరణ: ఓటర్ కార్డుల్లోని తప్పులను సరిదిద్దడం.​నకిలీ ఓట్ల తొలగింపు: మరణించిన వారి, వలస వెళ్లిన వారి మరియు నకిలీ ఓట్లను తొలగించడం.​మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేయాలని కోరుతున్నాను.

🌐 Select Language:
📰 ePaper