పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలి
అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్ పిలుపు
పయనించే సూర్యుడు,జూన్ 28, అశ్వాపురం: ఆదివారం నాడు పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 0 నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో చవిటి గూడెం లో మరియు sc కాలనీ లో అంగన్వాడి కేంద్రాలలో సర్పంచ్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వైద్య ఆరోగ్యశాఖ సూచనల ప్రకారం నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించాలని వారు తెలిపారు పల్స్ పోలియో కార్యక్రమం అందరూ బాధ్యతగా తీసుకొని యువత, స్వచ్ఛంద సేవా సంస్థలు , ప్రముఖులు, పెద్దలందరూ బాధ్యతగా తీసుకొని పిల్లలు ఎవరు మిస్ కాకుండా చూడాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉమారాణి, ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాష్ రావు, శ్యామలత వార్డు సభ్యులు రాగం సరిత, ఏఎన్ఎం బిక్షమ్మ ఆశా వర్కర్ సుజాత రాణి లలిత ,అంగన్వాడి టీచర్ సరళ తదితరులు పాల్గొన్నారు