పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: అనంతసాగర్ సర్పంచ్ వెన్నెల దయాకర్

June 28, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : పోలియో నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అనంతసాగర్ గ్రామ సర్పంచ్ వెన్నెల దయాకర్ పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని సర్పంచ్ వెన్నెల దయాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, “నిండు జీవితానికి రెండు చుక్కలు” అనే నినాదాన్ని ప్రతి కుటుంబం ఆచరణలో పెట్టాలని సూచించారు.పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఐదేళ్లలోపు పిల్లలను పోలియో చుక్కల కేంద్రాలకు తీసుకువచ్చి తప్పనిసరిగా మందు వేయించాలని కోరారు. చిన్నారుల ఆరోగ్య రక్షణలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, వైద్య సిబ్బంది, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొని పోలియో నిర్మూలనకు తమ వంతు సహకారం అందించాలని సంకల్పించారు.

🌐 Select Language:
📰 ePaper