హిందూ సామ్రాజ్య దినోత్సవం.

June 29, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు జూన్ 29 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఐ పోలవరం మండలం పాత ఇంజరం గ్రామం కోదండ రామస్వామి ఆలయ ప్రాంగణంలో సమరసత సేవా ఫౌండేషన్ ధార్మిక సమితి సభ్యుల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ పట్టాభిశక్తుడైన రోజును పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ముమ్మిడివరం ఆర్ఎస్ఎస్ ఖండ సంఘ చాలక్ జగ్గరాజు కృష్ణంరాజు పూలమాలతో అలంకరించారు మాతృమూర్తులు గ్రామస్తులు పుష్పాలు అలంకరణ చేసినారు ముందుగా ముమ్మిడివరం ఖండ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు మాట్లాడుతూ చత్రపతి శివాజీ హిందూ ధర్మ పరిరక్షణలో ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన్నారు హిందూ సామ్రాజ్యాన్ని ఏ విధంగా స్థాపన చేశారు మొదలగు విషయాలను తెలియజేశారు తదుపరి కృష్ణంరాజు మాట్లాడుతూ సుమారు 1000 సంవత్సరాలు మన దేశాన్ని విధర్మియులు పాలన చేసి మన సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేసి హిందువులందరినీ ఊస కోత కోస్తూ అనేక ఆకృత్యాలు చేస్తూ విపరీతమైన మతమార్పిడులను చేయడం జరిగిందన్నారు శివాజీ తల్లి జిజి భాయ్ చిన్నతనం నుండి శివాజీని ఒక వీరుడు వలె పెంచి ఈ దుర్మార్గులను చీల్చి చండాడి ఈ ధర్మాన్ని రక్షించాలని శివాజీకి అనునిత్యం గుర్తు చేస్తూ ఉండేది గ్రామ మహిళా కన్వీనర్ తోలేటి సుగుణ కుమారి శివాజీ చరిత్రను పిల్లలకు చిన్నతనము నుండి నేర్పుతూ ప్రతి ఇంటిలోనూ ఒక శివాజీ తయారు కావాలని ప్రతి ఒక్కరూ ఈ ధర్మరక్షణలో బాధ్యులు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో రాచకొండ రాంబాబు కొండేపూడి శ్రీనివాసరావు డి వెంకటేశ్వరరావు కొండేపూడి వరలక్ష్మి రాచకొండ పుణ్యవతి బొర్రా గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper