భైంసాలో నిలువుదోపిడీ చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలు

June 29, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: *విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కినా పట్టించుకోని ఎంఈఓ *ప్రైవేట్ యాజమాన్యాలతో ‘మరింత’ దోస్తీ.. ప్రభుత్వ విద్యావ్యవస్థకు కుస్తీ!* **ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భైంసా ప్రజావాణి లో డిఇఓ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది* *ఎస్ ఎఫ్ ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్* భైంసా పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్నాయని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) భైంసా కమిటీ ఆరోపించింది . విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే పుస్తకాలు, యూనిఫారాలు, డొనేషన్ల పేరుతో ప్రైవేట్ స్కూళ్లు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. నిరుపేద, మధ్యతరగతి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో తెచ్చిన “విద్యాహక్కు చట్టం” భైంసా పట్టణంలో పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించాల్సిన సీట్ల ఊసే లేదని, ఫీజుల నియంత్రణ కమిటీల పర్యవేక్షణ శూన్యమని వారు ధ్వజమెత్తారు. *మండల విద్యాధికారి (ఎంఈఓ ) వైఖరిపై విమర్శలు* :పట్టణంలో ఇంత బహిరంగంగా ఫీజుల దోపిడీ జరుగుతున్నా, నిబంధనలను ఉల్లంఘిస్తూ పాఠశాలలు నడుపుతున్నా… స్థానిక మండల విద్యాధికారి (ఎంఈఓ) కనీసం పట్టించుకోకపోవడం వెనుక ఉన్న మర్మమేమిటని ఎస్ఎఫ్ఐ ప్రశ్నించింది. ప్రైవేట్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంలో ఎంఈఓ పూర్తిగా విఫలమయ్యారని, వారి ఉదాసీన వైఖరి వల్లే ప్రైవేట్ సంస్థలు మరింత రెచ్చిపోతున్నాయని ఆరోపించారు. *ఎస్ఎఫ్ఐ డిమాండ్లు* :భైంసా పట్టణంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వివరాలను, జీవోల ప్రకారం నిర్ణయించిన ఫీజుల బోర్డులను బహిరంగంగా ప్రదర్శించాలి.విద్యాహక్కు చట్టాన్ని భైంసాలో పక్కాగా అమలు చేయాలి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న స్కూళ్ల గుర్తింపును రద్దు చేయాలి.ప్రైవేట్ స్కూళ్ల దోపిడీపై ఎంఈఓ తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో మండల విద్యాధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

🌐 Select Language:
📰 ePaper