MJPVC ఏం జె పి వి సి ఆధ్వర్యంలో నూతన సన్నాహక సమావేశం*
పయనించే సూర్యుడు జూన్ 29:ఆదివారం ఉదయం 11 గంటలకు మక్తల్ రాఘవేంద్ర కాలనీలో MJPVC ఆధ్వర్యంలో నూతన సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం కెవి నరసింహ అధ్యక్షతన ఎం జె పి వి సి చేయాల్సిన కార్యచరణతో పాటు నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది అలాగే మండలాలు అసెంబ్లీలో జిల్లా ఉమ్మడి జిల్లా నాయకులను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూర్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు వి జ్యోతి నారాయణ పేట జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు ముద్దు నవ్య శ్రీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు సంగోలా అశోక్ కుమార్ కృష్ణ మండలం అధ్యక్షులు కెవి గణేష్ మగానుర్ మండలం అధ్యక్షులు కుమ్మరి ఆంజనేయులు మక్తల్ మండలం అధ్యక్షులు కె ఆంజనేయులు ఉట్కూర్ మండలం అధ్యక్షులు కుమ్మరి శివ శంకర్ లను నియమించినట్టు మీడియా కన్వీనర్ కెవి గణేష్ ను నియమించమన్నారు అలాగే నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ రాబోయే కాలంలో MJPVC బలోపేతం చేయడం కోసం పాటు పడి పని చేస్తాం అన్నారు అనంతరం ప్రతి ఒక్కరిని శాలువాలతో సన్మానం చేసి నూతన కార్యవర్గను ఎన్నుకున్నట్టు కెవి నరసింహ తెలిపారు.