బైంసా పట్టణంలోని మిర్జాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సహకార వారోత్సవాలు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి:: భైంసా పట్టణంలోని మీర్జాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం చైర్మన్ అమెడ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల అభివృద్ధికి సహకార సంఘాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. రైతులకు తక్కువ వడ్డీపై రుణాలు అందించడం, ఎరువులు, విత్తనాలు సమయానికి అందించడం ద్వారా సహకార సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.సహకార సంఘాల బలోపేతానికి ప్రతి రైతు సహకరించాలని, రైతుల సంక్షేమమే సంఘం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను రైతులకు చేరవేయడంలో సహకార సంఘాలు వారధిగా పనిచేస్తున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో సీఈఓ రాజేందర్, డైరెక్టర్లు చంద్రకాంత్ రెడ్డి, శ్రీనివాస్, సంఘ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.