కాట్రేనికోన మండల పరిషత్ &తాసిల్దార్ కార్యాలయంలో అల్లూరి జయంతి వేడుకలు ఘనంగా
అల్లూరి ఆశయాలు యువతకు ఆదర్శం*
పయనించే సూర్యుడు జూలై 4 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ)మన్యం వీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి రాజేశ్వరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షురాలి ప్రతినిధి కోలాటి సత్యవతి సత్యం సమక్షంలో అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అల్లూరి ఆశయాలను యువత అందిపుచ్చుకోవాలని, ఆయన త్యాగనిరతి, దేశభక్తి అందరికీ ఆదర్శమని ఈ సందర్భంగా కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సిబ్బంది, స్వర్ణ గ్రామ సిబ్బంది పాల్గొన్నారు. & అలాగే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా కాట్రేనికోన తహసిల్దార్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. తహసిల్దారు రవి కిరణ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని తహసిల్దారు రవి కిరణ్ పేర్కొన్నారు. అల్లూరి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది అందరూ పాల్గొన్నారు.