బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం చేయాలి మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా పిలుపు

July 6, 2026 | ఆంధ్రప్రదేశ్

ప యనించే జూలై 5 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంస్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ స్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పి.గన్నవరం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు తిక్క సత్యనారాయణ అధ్యక్షతన లంకల గన్నవరంలో మండల ఉపాధ్యక్షుడు కోల్ల గోపాలకృష్ణ నివాసం వద్ద మండల స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది.ముఖ్య అతిథిగా హాజరైన అయ్యాజీ వేమా మాట్లాడుతూ బూత్ స్థాయిలో విస్తృత సమావేశాలు నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో పార్టీ నియమించిన బిఎల్ఏ 2 కార్యకర్తలు చురుకుగా పాల్గొని అర్హులైన ప్రతి పౌరుడి ఓటరు నమోదుకు కృషి చేయాలన్నారు. ప్రతి సోమవారం మండల జిల్లా స్థాయిలో జరిగే జనతా వారధి కార్యక్రమంలో పాల్గొని ప్రజల స్థానిక సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని కోరారు. జులై 6న జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటాలను నాయకులకు అందజేసి ప్రతి గ్రామంలో జయంతి ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మేడిది సత్యనారాయణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రంశెట్టి సాయిబాబు, తోలేటి సుబ్బారావు, మండల ప్రధాన కార్యదర్శి కోటే శివాజీ, జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి పితాని వెంకటేశ్వరావు, మండల కోశాధికారి బోడ్డు రామకృష్ణ, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు దిగుమర్తి ఏడుకొండలు, సీనియర్ నాయకులు కుడుపూడి సూర్యనారాయణ, పులపర్తి వెంకట కిషోర్, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు వరిగేటి మహేష్, మండల కార్యవర్గ సభ్యులు కడవల్లి శ్రీనివాస్ దీక్షితులు, ర్యాలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.లంకల గన్నవరంలో జరిగిన మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా. చిత్రంలో జిల్లా మండల నాయకులు ఉన్నారు.

🌐 Select Language:
📰 ePaper