ఫోక్సో నిందితుడు బండి సాయి భగీరత్ ను వెంటనే అరెస్టు చేయాలి* *TUCI జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్*
పయనించే సూర్యుడు మే15కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు ఫోక్సో నిందితుడు బండి సాయి భగీరత్ ను వెంటనే అరెస్ట్ చేయాలని టీ యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్ అన్నారు. స్థానికి టీ యు సి ఐ కార్యాలయం టీ యు సి ఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ లీలలు, అరాచకాలు ఎన్నో ఆధారాలతో బయటకు వచ్చాయి అన్నారు. బండి భగీరథ అరాచకాలు, లైంగిక ఆరోపణల అన్నింటిపై విచారించాలని అన్నారు. కొడుకు ను రక్షించే ప్రయత్నం చేస్తున్న బండి సంజయ్ రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం , పోలీస్ లు కేస్ ను ఏమార్చే వైఖరి మానాలన్నారు. సామాన్యులకు ఒక చట్టం ఉన్నవాళ్లకు ఒక చట్టంగా కనిపిస్తూ ఉన్నది. నిందితుడిని శిక్ష నుండి తప్పించే ప్రయత్నం బిజెపి చేస్తుందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో టీ యు సి ఐ జిల్లా కోశాధికారి కొలిమి రాములు, జిల్లా నాయకులు ఆంజనేయులు, ఏ ఐ యు కె ఎస్ జిల్లా నాయకులు వెంకటేష్ , పి వై ఎల్ జిల్లా నాయకులు మల్లేష్ , గణేష్ తదితరులు పాల్గొన్నారు.