గుంటూరు జిల్లా బిజెపి ఇంచార్జిగా యల్ల దొరబాబు: బోడసకుర్రులో ఘన సన్మానం
పయనించే సూర్యుడు జూన్ 9 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజు)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం బోడసకుర్రు* రాజధాని అమరావతిలో గుంటూరు జిల్లా బిజెపి ఇంచార్జిగా నియమితులైన తూర్పుగోదావరి జిల్లా పూర్వ అధ్యక్షులు, రాష్ట్ర అల్ట్రా చైర్మన్ యల్ల దొరబాబును జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మత్స్యకార నాయకులు, గ్రామ ప్రజలు, జనసేన యూత్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ బిజెపి పార్టీ ఈ రాష్ట్రంలో అభివృద్ధికి విరివిగా కృషి చేస్తుందని తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసిమెలిసి ఉండి రాబోయే రోజుల్లో పార్టీని పటిష్టం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు అరవ చంటి, సొసైటీ డైరెక్టర్ మోయలి గణపతిరావు, ఆత్మ డైరెక్టర్ ఓలేటి పరమేశ్వరావు, ఆర్టిసి రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు దొమ్మేటి రాధాకృష్ణ, ఐల నాగేశ్వరరావు, ముత్యాల దుర్గారావు, మేకల ఈశ్వరావు, రంకిరెడ్డి వెంకటేశ్వరరావు, మహిళ గణపతిరావు, ఓలేటి అప్పలస్వామి, పావిశెట్టి భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.