Sunday, August 17, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆదురుపల్లిలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ఆదురుపల్లిలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Listen to this article

కృష్ణుడి గోపిక వేషధారణలలో అలరించిన చిన్నారులు

పయనించే సూర్యుడు ఆగస్టు 17 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామంలోని శ్రీకృష్ణ మందిరంలో జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఉదయం నుండి భక్తులు స్వామివారి దర్శనార్థం తరలి వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు శ్రీకృష్ణుడికి ప్రత్యేక అలంకరణలు చేసి అర్చనలు నిర్వహించగా,భక్తులు హారతులు ఇచ్చి శ్రద్ధాభక్తులతో ప్రార్థనలు చేశారు. పిల్లలు శ్రీకృష్ణుడు,గోపికల వేషధారణలో పాల్గొని భజనలు ఆలపించడంతో వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఆలయం అందంగా అలంకరించబడడంతో భక్తులకు పండుగ వాతావరణం అలరించింది. కార్యక్రమం ముగిసిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.గ్రామస్తులు, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని భక్తి గీతాలు పాడుతూ, కృష్ణుడి లీలలను స్మరించుకున్నారు. స్థానిక యువత స్వచ్ఛందంగా సేవలు అందించారు. ఈ సందర్భంగా గ్రామంలో సర్వత్రా పండుగ వాతావరణం నెలకొంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరూ ఆనందంగా, ఏకముగా వేడుకలను జరుపుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments