
జనం న్యూస్ ఆగస్టు 16 పెన్ పహాడ్ :
పేద ప్రజల కళ్ళల్లో వెలుగు చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్య మని రాష్ట్ర పర్యాటక చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని అన్నారం గ్రామం జె ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు గొప్పవరమన్నారు.ఇండ్లు పొందిన లబ్ధిదారులు వెంటనే ముగ్గులు పోసుకొని ఇల్లు కట్టుకోవడం ప్రారంభించాలని కోరారు. పేదవారి ఆత్మ గౌరవానికి రేషన్ కార్డులు చిహ్నం అని అన్నారు. రేషన్ కార్డులతో పాటు, సన్న బియ్యం లాంటి గొప్ప పథకాలు సూర్యాపేట జిల్లా నుండే ప్రారంభం కావడం జిల్లా వాసుల అదృష్టమని అన్నారు. పేదవారు సైతం సన్నబియ్యంతో భోజనం చేయాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు సన్న బియ్యం అందిస్తుందన్నారు. ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అర్హత కలిగిన వారందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వటం అలాగే సన్నబియ్యం ఇవ్వటం చాలా సంతోషం అని అన్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల మేరకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన ప్రతి లబ్ధిదారుడు ఇల్లు త్వరగా పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసుకొని సంతోషంగా ఉండాలని కోరారు. కాగా పెనపహాడ్ మండలంలో 1477 నూతన రేషన్ కార్డులతో కలిపి మొత్తం 14225 కార్డులన్నారు., 613 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ పి. రాంబాబు, ఆర్డీఓ వేణుమాధవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మల సురేష్ రావు మండల ఇంచార్జ్ అధికారి అండ్ ఎస్టి సంక్షేమ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ నాయక్, డి ఎస్ ఓ మోహన్ బాబు, పి డి హౌసింగ్ జి. సిద్ధార్థ, డి ఇ జబ్బార్ అహ్మద్, ఏ. ఇ పి రాంబాబు, హౌసింగ్ ఇన్స్పెక్టర్ అబ్దుల్లా ఎమ్మార్వో లాలు నాయక్ ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.
