
భక్తిశ్రద్ధలతో బోనాల నిర్వహణ భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు
( పయనించే సూర్యుడు ఆగస్టు 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
శేరిల్ల మైసమ్మ తల్లీ భోనాలను భక్తి, శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. ప్రతీ సంవత్సరం చివరి శ్రావణ సోమవారం నాడు మైసమ్మ తల్లీకి బోనాలను నిర్వహించడం అనవాహితీగా వస్తున్నది. అందులో భాగంగా ఈరోజు సోమవారం నాడు సాయంత్రం బండ్ల బోనాలు నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయ పద్దతిలో తయారు చేసిన బోనాలను మహిళలు ఎత్తుకొని ర్యాలీగా వచ్చి అమ్మవారికి సమర్పించారు. బోనాల ముందు శివసత్తుల పూనకాలు, యువకుల నృత్యాలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. ఉదయం నుండి వర్షాని లెక్క చెయ్యకుండా భక్తులు దేవాలయం కు వచ్చి నైవేద్యము సమర్పించి మొక్కుబడిని తీర్చుకున్నారు. ఈ ఉత్సవాలలో మాజీ వైస్ ఎంపిపి రాజేష్ పటేల్, బిజెపి సత్యనారాయణ, కావలి వెంకటయ్య, దశరథ, బోనం మల్లయ్య, పెర్మల్ల చంద్రశేఖర్, పాపిరెడ్డి, మొడుసు యాదగిరి, రామస్వామి తదితరులు పాలుగోన్నారు.
