
గత నాలుగు సంవత్సరాలుగా యు డి సి లు లేకపోవడం వలన నెల నెల జీతాలు డబ్బులు ఇచ్చి చేయించాల్సి వస్తుంది
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 19
ఈ రోజు కూనవరం మండల కేంద్రం లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ మరియు ఐ యన్ టి యు సి (3194) ఆద్వర్యం లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి జోగారావు, ఐ యన్ టి యు సి డివిజన్ అధ్యక్షులు డి.శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది ఈ సమావేశం లో చింతూరు డివిజన్ లో ఉన్న 10 పి హెచ్ సి ల ముఖ్య సభ్యులు అందరు హాజరు కావడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా చింతూరు డివిజన్ లో సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్లు లేకపోవడం వలన ఉద్యోగులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు, సర్వీస్ రిజిస్టర్ లు అప్డేట్ చేయలేక పోతున్నారు, యూనిఫాం అలవన్స్, సరెండర్ లీవ్స్,జి పి ఫ్, లాంటివి గత నాలుగు సంవత్సరాలుగా పొందలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే జీతాల విషయంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు అని వారి బాధలను వ్యక్త పరచడం జరిగింది వారి బాధలను విన్న అనంతరం ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి జోగారావు మరియు ఐ యన్ టి యు సి డివిజన్ అధ్యక్షులు డి.శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ విషయమై గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి, గతంలో ఉన్న ఐ టి డి ఏ పి ఓ గారికి, గతంలో ఉన్న డి యం హెచ్ ఓ గారికి , డిప్యూటీ డీ యం హెచ్ ఓ అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగిందని అయిన ఇంత వరకు సమస్య పరిష్కారం చేయలేదని అన్నారు ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యను పరిష్కరించకపోతే మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు అందరు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సి వస్తుందని అధికారాలను కోరుతున్నామని అన్నారు త్వరలో ఈ విషయమై ఉద్యోగులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ చేస్తామని ప్రకటిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జి. సీత, ప్రచార కార్యదర్శి కె.అర్జున్, సలహాలు దారులు కె.భద్రకాళి , టి సీత, యం. జయ యం పున్నమ్మ, యన్. లక్ష్మీ, పి.వజన కుమారి, ఐ. మంగమ్మ. యాస్ వెంకటేశ్వర్లు మరియు ఎ యన్ యం లు తదితరులు పాల్గొన్నారు