Friday, August 22, 2025
Homeఆంధ్రప్రదేశ్గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని-జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని-జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 22 సూర్యాపేట జిల్లా ప్రతినిధి:

గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గణేష్ కమిటీలను కోరారు.

గురువారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో జిల్లా ఎస్పీ కె నర్సింహతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శాంతి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రులు లలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని,మండపాల్లో షార్ట్ సర్క్యూట్ స్ జరగకుండా తగ్గిన జాగ్రత్తలు తీసుకోవాలని,పంచాయతీ అధికారులు మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు నిర్వహించాలని,మండపాల వద్దకు రోడ్డు ఏర్పాటు చేయాలని చిన్న పిల్లలకి వృద్ధులకి నిమజ్జనం వద్ద ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని,నిమజ్జనం అయిపోగానే వాహనాలు వెళ్లిపోయేల ప్రణాళికలు సిద్ధం చేయాలని మున్సిపాలిటీలో శోభయాత్ర ని నిర్వహించేటప్పుడు చెట్లు అడ్డు తగలకుండా కొమ్మలు తొలగించాలని,రోడ్లపై గుంటలు పుడ్చాలని,స్పీడ్ బ్రేకర్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని,భక్తులకు త్రాగునీరు వసతి కల్పించాలని నిమజ్జనం చేసే ప్రదేశాలకు రూట్ మ్యాప్ తయారు చేయాలని నిమ్మజనం చేసే ప్రదేశాలలో వాహనాలు ప్రవేశించేందుకు,బయటికి వెళ్లేందుకు వేరు వేరు రోడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.డివిజన్ స్థాయిలో,మండల స్థాయిలో ఆర్డీవోలు డి.ఎస్పీలు తమ సిబ్బంది చె క్షేత్ర స్థాయి పర్యటన చేపించి తర్వాత కార్యచారణ రూపొందించుకోవాలని ఎంపీడీవోలతో గ్రామపంచాయతీ అధికారులతో జడ్పీ సీఈవో,జిల్లా పంచాయతీ అధికారి సమావేశం నిర్వహించి ప్రతి గ్రామంలో మండపాల వద్ద తీసుకోవాల్సిన చర్యలు అధికారులకు సూచించాలని ఆదేశించారు.వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పీహెచ్ సి సబ్ సెంటర్లు,ఏరియా హాస్పిటల్ లో,అత్యవసర సేవలకు, తగినట్లుగా ఏర్పాటు చేసుకోవాలని నిమజ్జనం చేసే ప్రదేశంలో హెల్త్ క్యాప్ నిర్వహించాలని ఆదేశించారు. పెద్దలందరూ యువతకు పలు సూచనలు చేస్తూ భక్తిశ్రద్ధలతో కార్యక్రమం జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. మండపాల్లో మహిళా భద్రతకే ప్రాధాన్యత ఇస్తామని,నిమజ్జనం చేసే ప్రదేశంలో హెల్ప్ డేస్క్ ఏర్పాటు చేయాలని, నవరాత్రులు పాటు కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పండుగను ఆహ్లాదకర వాతావరణం లో జరుపుకునే విధంగా సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.జిల్లా ఎస్పీ కె నరసింహ మాట్లాడుతూ ప్రజలను రక్షించేందుకు పోలీస్ శాఖ ముందుగా ఉంటుందని శాంతిభద్ర లకు ఎలాంటి ఆటంకం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాన్ని తగినట్లుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కాబట్టి పోలీస్ స్టేషన్ లో గాని మొబైల్ ద్వారా గాని ఆన్లైన్లో ప్రతి మండపాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.నవరాత్రులలో ఎలాంటి సంఘటన జరగకుండా ప్రజల రక్షణ కొరకు కొన్ని నిబంధనలు ఉంటాయని వాటిని ప్రతి ఒక్కరు పాటించాలని ప్రతి మండపము వద్ద సీసీటీవీ ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదని,నిమజ్జనం రోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం సమయంలో నిమజ్జనం చేసుకుంటే అందరికీ సౌకర్యంగా ఉంటుందని సూచించారు. నిమ్మజ్జనం,రోజు డ్రైవర్లు ఒక వాహనానికి ఒక్క డ్రైవరు ఉండేలాగా అదేవిధంగా మందు తాగకుండా,మొబైల్ ఉపయోగించకుండా,నెమ్మదిగా వాహనం నడిపే విధంగా చూడాలని,ఆరోజు కచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటిస్తూ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ పండగ ఉన్నత్యాన్ని పెంపొందించేలా చూడాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు.అంతకు ముందు,భానుపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు,విశ్వ హిందూ పరిషత్ సభ్యులైన కృపాకర్ రుప్మా రావు, రాజేశ్వరరావు,నరసింహారావు,షేక్ ఫరూక్,పాండురంగ చారి,విజయ్ కృష్ణ,రవిచంద్ర మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా శాంతియుతం వాతావరణంలో నిర్వహించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని, నిమజ్జనం చేసే సద్దలచెరువు వద్ద ఏర్పాటు చేయాలని,మున్సిపాలిటీ ద్వారా శానిటేషన్ నిర్వహించాలని, ముఖ్యమైన ప్రదేశాల్లో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు క్రేన్లు,లైటింగ్స్ ఏర్పాటు చేయాలని,రోడ్డుపై గుంతలు పూడ్చాలని,విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, రోడ్డుకి అడ్డంగా ఉన్న చెట్లను తొలగించాలని ఈ సందర్భంగా కోరారు.అదనపు కలెక్టర్ పి రాంబాబు, ఆర్డీవోలు,డి.ఎస్పీలు,మున్సిపల్ కమిషనర్లు,జిల్లా అధికారులు,శాంతి కమిటీ సభ్యులు,భానుపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కృపాకర్, రుక్మారావు,రమేష్,రాజేశ్వరరావు, ఉపేందర్,నరసింహారావు,జయ కృష్ణ,షేక్ ఫరూక్,రవిచంద్ర, ప్రభాకర్,విశ్వ హిందూ పరిషత్ సభ్యులు,తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments