
పయనించే సూర్యుడు ఆగస్టు 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ : పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్పిపల్ కమీషనర్ నాగరాజు, అన్నారు. అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం ఎకోక్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత అధ్యక్షతన జరిగిన పర్యావరణ అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. పంచభూతాలను కాపాడుకోవాలని మొక్కలు విరివిగా నాటి సంరక్షాంచాలని ఘణేష్ నవరాత్రుల సందర్భంగా ధ్వని కాలుష్యం కాకుండా చూడాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హరిత మాట్లాడుతూ పర్యవరణాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో స్వచ్ఛమైన ప్రాణవాయువు లభించడం కష్టమవుతుందని విద్యార్ధులందరూ రాబోయే కాలానికి తగిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ,ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కృత్రిమ రంగులతో తయారుచేసిన వినాయక విగ్రహాలను కాకుడా పర్యావరణ రక్షిత విగ్రహాలను పూజకు వినియోగించాలని పి.ఒపి విసోఫటనం వలన అనేక జీవరాశులు నాశనమవుతున్నాయని అన్నారు. ప్రతివిద్యార్ధి అమ్మపేరుపై ఒక మొక్కను నాటాలని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మట్టి వినాయక ప్రతిమల తయారీ పోటీలో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులను అందచేశారు.మొదటిబహుమతిని 9వతరగతి విద్యార్ధి వి.చరణ్ తేజ, రెండవబహుమతిని 8వతరగతి చదువుతున్న బి.లాస్య, 3వ బహుమతిని 9వతరగతి చదువుతున్న సి.హెచ్. చరణ్ గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్ధులు పాల్గొన్నారు.