
ఎన్టీఆర్ జిల్లా పయనించే సూర్యుడు ప్రతి నీధి కంచికచర్ల మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో సోమవారం నాడు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం నాయకులతో కలిసి కంచికచర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కోగంటి మాట్లాడుతూ ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు పారదర్శకంగా, సులభంగా రేషన్ సరుకులు అందుతాయని ఆయన వివరించారు. ఈ కార్డులు ఆధునిక సాంకేతికతతో రూపొందించబడ్డాయని, ఇవి రేషన్ సరుకుల పంపిణీలో సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, అవినీతిని నిరోధించడంలో కూడా సహాయపడతాయని ఆయన అన్నారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డులు గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.