
హుజురాబాదు మండలం రంగాపూర్ గ్రామం.
పయనించే సూర్యుడు : ఆగస్టు 25: హుజురాబాద్ టౌన్ రిపోర్టర్ దాసరి రవి: సమాచార హక్కు చట్టం హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామ అధ్యక్షుడిగా బండ నరేందర్ ను నియమిస్తూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ ప్రజల కులాలు ప్రవేశించేందుకు మరియు సమాచార హక్కు చట్టం ఆర్టిఐ ద్వారా ప్రభుత్వాన్ని నిబంధనల ప్రకారం పౌరులకు లభించాల్సిన ప్రయోజనాలు పొందడంలో సహాయపడేందుకు కృషి చేస్తుందని ముఖ్యంగా శివశక్తి మరియు అసూ శక్తి రంగాలలో పనిచేస్తున్న ప్రజల గృహ కుటుంబ సమస్యల పరిష్కరించేందుకు మరియు వారి సంక్షేమానికి నిబద్ధతగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన నియామకం పట్ల నరేందర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కమిటీ విధానాలను పటిష్టం చేయడంలో మరియు ప్రజలకు అందుబాటులో ఉండే సేవలు అందించడంలో తన పూర్తి సేవను అంకితంగా ఉపయోగించుకుంటానని వెల్లడించారు. అదే విధంగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజుకి, జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం కి, రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి సుర స్రవంతికి, తన నియామకానికి సహకరించినటువంటి హుజురాబాద్ మండల అధ్యక్షుడు పల్లె సతీష్ గౌడ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.