టిట్కో కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించాలికలెక్టర్‌కు బీజేపీ వినతి
పయ నించే సూర్యుడు జూలై 13 ముమ్మిడివరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం :*అంబేద్కర్ పవన్ కళ్యాణ్ జిల్లా అమలాపురం కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో బీజేపీ ‘జనతా వారధి’లో భాగంగా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అమలాపురం పట్టణ అధ్యక్షులు అయ్యల భాస్కర్ రావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు డిడ్కో టిట్కో బిల్డింగుల సముదాయంలోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.అమలాపురం అసెంబ్లీ పరిధిలోని 30 వార్డుల్లోని నిరుపేదలకు నివాస గృహాలుగా టిట్కో బిల్డింగ్ సముదాయంలో 1632 ప్లాట్లు, 510 సొంత ఇంటి స్థలాలు కేటాయించారు. ప్రస్తుతం ఇందులో సుమారు 1000 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కాలనీ అమలాపురం పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో నివాసితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో టిట్కో కాలనీకి ప్రత్యేకంగా ఒక వార్డును ఏర్పాటు చేయాలని, రెండు పోలింగ్ బూతులు, ఒక సచివాలయం ఏర్పాటు చేయాలని, మెయిన్ రోడ్డు నుంచి కాలనీకి అనుసంధాన రోడ్డు వేయాలని వినతిపత్రంలో కోరారు. అలాగే టిట్కో సముదాయానికి సమీపంలో స్మశాన వాటిక లేకపోవడంతో బోడసకుర్రు పంచాయతీ వారు మృతదేహాలను ఇక్కడికి తీసుకురావడానికి అంగీకరించడం లేదని, అమలాపురం పట్టణ స్మశానానికి తీసుకెళ్లాలని సూచిస్తూ ఇబ్బందులు సృష్టిస్తున్నారని తెలిపారు. కావున టిట్కో బిల్డింగ్ సముదాయానికి ప్రత్యేక స్మశాన వాటికను ఏర్పాటు చేయాలని అమలాపురం బీజేపీ పట్టణ కమిటీ విజ్ఞప్తి చేసింది.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్, జిల్లా నాయకులు చీకరమెల్లి శ్రీనివాస్, దాట్ల సుబ్బరాజు, అరిగెల నాని, షేక్ షహీర్, కుసుమ సునీత, కురసా ఆంజనేయులుతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.