
పయనించే సూర్యుడు ఆగస్టు 26 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో మదర్ తెరిసా 115వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఫౌండర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ మదర్ తెరిసా గారు పుట్టి 115 సంవత్సరాలు పూర్తయినది. అయినప్పటికీ ఆమె ఇతరుల పట్ల చేసిన సేవ ఈనాటికి మరువలేము. అంతటి దయ, జాలి,కరుణ, ప్రేమాభిమానం ఉన్నటువంటి వ్యక్తి మదర్ తెరిసా గారి 115వ జయంతిని మేము ఆశ్రమంలో జ్ఞాపకం చేసుకోవడం మాకు ఆనందకరం. మదర్ తెరిసా గారు ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని, ఆ మాట అనడమే కాకుండా ఇతరులకు ఆమె సహాయము చేసి చూపించేవారు. ఇందు నిమిత్తమై మేము ఆశ్రమంలో ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేసి, ఆశ్రమంలోని నిరాశ్రయులకు మిఠాయిలు పంచడం జరిగింది.