
గుగులోత్ రామ్ చందర్ కొత్తగూడెం జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు
పయనించే సూర్యుడు ఆగస్టు 28 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :మండలం.తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నాభద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు. రామ్ చందర్ గురువారం టేకులపల్లి మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర రైతు సంఘం పిలుపుమేరకు ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా గుగులోతు రామ్ చందర్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత ఉన్నందున తక్షణమే యూరియా కొరతను భర్తీ చేసి రైతులకు అందించాలని ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం డిప్యూటీ తహసిల్దార్ తోలెం బాబుకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో అన్నిమండలంలో రైతంగానికి సరిపడా యూరియా సరఫరా చేయడంలో రైతాంగానికి సరిపడా యూరియా సరఫరా చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయి. అప్పులు చేసి సాగు ప్రారంభించిన రైతులు సకాలంలో యూరియా అందకపోవటంతో అప్పుల ఊబిలో కురుకుపోయే ప్రమాదం ఏర్పడిందని ఈ పరిస్థితుల్లో సిపిఐ అనుబంధ ఏఐకేఎస్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అన్ని మండల కేంద్రము ఎదుట ధర్నాలు నిర్వహించి వినతి పత్రాన్ని ప్రజా సంఘాల శ్రేణుల తో అందించినాము. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి అయిత శ్రీరాములు గుగులోతు శ్రీను తేజావత్ మధు జినుక వెంకన్న తేజవత్ శ్యాం బాబు సమ్మయ్య లక్ష్మణ్ నరేందర్ గుగులోతు సోనీ జోగా కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు