
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికె గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భీంగల్ పట్టణ పరిసర ప్రాంతాలలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు ప్రజలను కోరడం జరిగింది.
ఎన్ ఎస్ యు ఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ రెహమాన్ తో కలిసి భీంగల్ పట్టణంలోని 11వ వార్డును సందర్శించిన నాగేంద్ర భీమ్గల్ పట్టణ ప్రజలు భారీ వర్షాలు తగ్గేవరకు పూర్తి అప్రమత్తతో ఉండాలని ఏ క్షణంలోనైనా వాగులు చెరువులు పొంగే ప్రమాదం ఉన్నందున ప్రజలు ఎవ్వరు బయట తిరగకూడదని ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు బయటకు రాకుండా చూసుకోవాలని అలాగే విద్యుత్ వైర్ల పట్ల పూర్తి జాగ్రత్తగా ఉండాలని ఎక్కడైనా ఏదైనా ప్రమాదకరంగా కనిపిస్తే వెంటనే అధికారులకు సంప్రదించాలని ప్రభుత్వ యంత్రాంగం మరియు అధికారులు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో పూర్తి అప్రమత్తత తో ఉండాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన అత్యవసర పరిస్థితి ఎదురైన వెంటనే అధికారులకు గాని స్థానిక నాయకులకు గాని తెలియజేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు.
