పొన్నాడ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలురోగులకు పండ్లు, పాలు పంపిణీ

July 14, 2026 | ఆంధ్రప్రదేశ్

పయ నుంచే సూర్యుడు జూలై 14 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాముమ్మిడివరం :
ముమ్మిడివరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మాజీ శాసనసభ్యులు, మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ జన్మదిన వేడుకలను రాష్ట్ర ప్రచార విభాగ కార్యదర్శి వల్లభుని దొరబాబు ఆధ్వర్యంలో ముమ్మిడివరం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సతీష్ కుమార్ సేవలను కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమం అనంతరం ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్, పాలు పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మండల పరిషత్ అధ్యక్షులు కోలా బాబ్జి, కాట్రేనికోన జిల్లా పరిషత్ సభ్యులు నేల కిషోర్, కోన శ్రీనివాస్, కాశి రామకృష్ణ, రాయపురెడ్డి జానకిరామయ్య, కోరసిక సత్తిబాబు, వేటుకూరి బోస్ రాజు, రెడ్డి శివన్నారాయణ, దొమ్మేట అప్పారావు, నాట్ర వీర్రాజు, రామకృష్ణ రాజు, కాండ్రేగుల త్రిమూర్తులు, మట్టా సత్తిబాబు, వస్త్రాల వీరన్న, కర్రీ శ్రీను, రేకాడి వర్మ, మోకా రామారావు, పులిదిండి రాజేష్, బోనం చిన్ని, తాతాజీ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper